సుప్రీంకోర్టులో కేజ్రివాల్ కు దక్కని ఊరట

-

సుప్రీంకోర్టులో కేజ్రివాల్ కు దక్కని ఊరట. సుప్రీంకోర్టులో మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బిగ్‌ షాక్‌ తగిలింది. హై కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు ఆగాల్సిందేనని సుప్రీం కోర్టు తాజాగా వెల్లడించింది. ఇవాళ సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బెయిల్‌ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బిగ్‌ షాక్‌ తగిలింది.

లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను నిలిపేసింది ఢిల్లి హైకోర్టు. దాంతో సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు కేజ్రివాల్. ఎల్లుండి కేజ్రివాల్ పిటిషన్ పై విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. హై కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు ఆగాల్సిందేనని సుప్రీం కోర్టు తాజాగా వెల్లడించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు పోలీసులు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version