G20 సదస్సులో స్పెషల్ అట్రాక్షన్​గా ‘కోణార్క్ వీల్’

-

భారత్ వేదికగా తొలిసారిగా జీ-20 శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. దిల్లీ వేదికగా ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వివిధ దేశాలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. ప్రపంచ దేశాల నేతలకు భారత్ మండపంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలుకుతున్నారు. మోదీ లీడ‌ర్ల‌ను ఆహ్వానించే ప్ర‌దేశంలో ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌పై భారీ కోణార్క్ వీల్‌ను ముద్రించారు. కోణార్క్ వీల్ వ‌ద్దే వివిధ దేశాధినేత‌ల్ని ప్ర‌ధాని మోదీ ఆహ్వానించారు.

ఒడిశాకు చెందిన కోణార్క్ వీల్ జీ20 అతిథుల్ని విశేషంగా ఆక‌ర్షిస్తోంది. 13వ శతాబ్ధంలో ఒక‌టో న‌ర్సింహదేవ రాజు కోణార్క్ వీల్‌ను నిర్మించారు. ఈ చ‌క్రం ఆధారంగానే జాతీయ జెండాలో 24 చువ్వ‌లు ఉన్న వీల్‌ను పొందుప‌రిచారు. భార‌తీయ ప్రాచీన సంస్కృతి, నాగ‌రిక‌త‌, వాస్తు క‌ళ‌కు ఆ చ‌క్రం ప్ర‌తిబింబంగా నిలువ‌నుంది. కోణార్క్ వీల్‌లో ఉన్న రొటేష‌న్ మోష‌న్‌.. కాల‌చ‌క్రానికి సంకేతంగా నిలుస్తుంది. ప్ర‌జాస్వామ్యం ఆద‌ర్శాలు, నిబ‌ద్ధ‌త‌కు ఈ చిహ్నం శ‌క్తివంతంగా నిలుస్తుంద‌ని చెబుతున్నారు. స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతున్న ప్ర‌తినిధుల కోసం ప్ర‌త్యేక‌ కోణార్క్ వీల్ బ్యాడ్జీల‌ను అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version