ముంచుకొస్తున్న Khosta-2 virus..మనుషులకూ సోకుతుందంటున్న తాజా పరిశోధనలు..

-

కరోనా మహమ్మారి ఏ ముహుర్తాన వచ్చిందో కానీ..అప్పటి నుంచి ఒక దాని తర్వాత. ఒకటి ఎంట్రీ ఇస్తూనే ఉన్నాయి. పిల్లలు, పెద్దలు అని తేడా లేదు. ఆఖరికి మూగజీవులను కూడా వైరస్‌లు వదలడం లేదు. తాజాగా మరో కొత్త రకం వైరస్​ను అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఖోస్తా 2గా పిలుస్తున్న ఈ వైరస్​.. మనుషుల్లో వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఇది మనిషి కణాల్లోకి ప్రవేశించడంతో పాటు ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు దీనిపై ప్రభావం చూపించడం లేదని స్పష్టం చేశారు.

అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించిన ఖోస్తా 2 వైరస్​ను 2020లో తొలిసారిగా రష్యాలోని గబ్బిలాల్లోనే గుర్తించారట.. 2020లోనే ఈ ఖోస్తా 2పై పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు.. ఇది మనుషులపై ప్రభావం చూపించదు అని భావించారు. తాజాగా మరోమారు జరిగిన పరిశోధనల్లో మాత్రం.. ఈ వైరస్​ మనుషులకు సోకుతుందని కనుగొన్నారు. కొవిడ్​కి టీకా వేసుకున్న వారిపైనా ఇది ప్రభావం చూపిస్తుండటం కాస్త ఆందోళనకర విషయమే. ఇందుకు సంబంధించిన రీసెర్చ్​.. జర్నల్​ పీఎల్​ఓఎస్​ పాథోజెన్స్​లో పబ్లిష్​ అయ్యింది.

ఖోస్తా 2 వైరస్​ అంటే..

ఈ సార్స్​ కోవ్​2, ఖోస్తా 2 వైరస్​లు.. సర్బెకొవైరస్​ జాతికి చెందినవి. ఖోస్తా 1.. మనుషులపై ప్రభావం చూపించదు. కానీ ఖోస్తా 2.. మనుషులకు ముప్పుగా మారే అవకాశం ఉంది. మనిషి కణాల్లోకి కొవిడ్​ ఏ విధంగా ప్రవేశించిందో.. అదే విధంగా… ఈ ఖోస్తా 2 వైరస్​ కూడా వెళుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒమిక్రాన్​లాగా.. తీవ్రమైన అనారోగ్య సమస్యలను సృష్టించే జీన్స్​ ఈ ఖోస్తా 2కు ప్రస్తుతం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే.. సార్స్​ కొవ్​ 2 జీన్స్​తో ఇది కలిస్తే.. ప్రమాదం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఖోస్తా 2 వ్యాప్తి ఎలా ఉంటుంది?

ఈ ఖోస్తా 2 ప్రస్తుతం జంతువుల్లోనే వ్యాపిస్తోంది. ఇది మరో మహమ్మారిగా మారుతుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పుడున్న టీకాలు.. కేవలం ఒక్క వైరస్​ కోసమే రూపొందించారు. అందువల్ల వేరే వైరస్​లపై ఇవి పనిచేయం లేదు. అన్ని రకాల వైరస్​ల నుంచి రక్షణ పొందే విధంగా టీకాలను అభివృద్ధి చేయడం ఇప్పుడు చాలా అవసరం ఎంతైనా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news