ఛతీస్ గఢ్ లో ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ లో మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించినట్టు బస్తర్ ఏరియా ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. బీజాపూర్ నేషనల్ పార్కు సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరూ జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. మావోయిస్టుల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు.
అంతకు ముందు ఛతీస్ గడ్ అడవులు తుపాకుల మోతతో దద్దరిల్లాయి. ముఖ్యంగా బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కులో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. పలువురికీ గాయాలు అయ్యాయి. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు.