మంచిపనులు చేసే వారికి గౌరవం దక్కదు.. గడ్కరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

రాజకీయాలపై కేంద్ర మం త్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంచి పనులు చేసే వారికి గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారి సంఖ్య తగ్గిపోతోందని అన్నారు. సిద్ధాంతాలను పట్టించుకోకుండా ఏ పార్టీ అధికారంలో ఉంటే దాంతో కలిసి వెళ్లాలనే ధోరణి మంచిది కాదని వ్యాఖ్యానించారు. మంచి పనులు చేసిన వారికి గౌరవం దక్కడం, అవినీతిపరులకు శిక్ష పడటం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహింన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“రాజకీయ నాయకులు వస్తుంటారు..పోతుంటారు. పబ్లిసిటీ, పాపులారిటీ అవసరమే కానీ.. నేతలు తమ నియోజకవర్గాల్లో చేసిన పనే వారికి వన్నె తెస్తుంది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ తర్వాత రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌ తీరు నన్ను ఆకట్టుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ వాక్చాతుర్యం గమ్మత్తుగా ఉంటుంది. రానున్న రోజుల్లో మన ప్రజాస్వామ్యం ఇంకా బలోపేతం అవుతుంది” అని నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version