బెంగాల్ బంద్‌ అక్రమమంటూ హైకోర్టులో పిటిషన్.. డిస్మిస్ చేసిన చీఫ్ జస్టిస్!

-

పశ్చిమ బెంగాల్ రణరంగంగా మారింది. కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ విద్యార్థిని హత్యాచారం కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు, వైద్య విద్యార్థులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. వీరికి ప్రతిపక్ష బీజేపీ పార్టీ మద్దతు ప్రకటించగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామాకు విద్యార్థి సంఘలు, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం విద్యార్థి సంఘాలు సీఎం రాజీనామాకు డిమాండ్ చేయడంతో పాటు సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించాయి.

దీంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు ఆందోళన కారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. దీనిని నిరసిస్తూ బీజేపీ బుధవారం బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే, ఈ బంద్ అక్రమం అంటూ దాఖలైన పిటిషన్‌ను కోల్‌కతా హైకోర్టు తోసిపుచ్చింది.

ఈ కేసులో తప్పుడు సమాచారంతో ఇకపై ఎవరూ పిల్స్ వేయకూడదంటూ సదరు పిటిషనర్‌ను చీఫ్ జస్టిస్ శివజ్ఞానం, జస్టిస్ హిరణ్మయ్ భట్టాచార్య ధర్మాసనం అడ్డుకున్నది. అయితే, బీజేపీ ఇచ్చిన బెంగాల్ బంద్ పిలుపుతో రాష్ట్రం ప్రస్తుతం అట్టుడుకుతోంది. అటు అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నేతలు పరస్పరం దాడులకు పాల్పడినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version