రెండ్రోజుల పర్యటనలో భాగంగా భూటాన్ కు ప్రధాని మోదీ

-

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ భూటాన్కు బయలుదేరారు. ఈ పర్యటనలో తాను అక్కడ వివిధ కార్యక్రమాలకు హాజరవుతానని ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాలో (ఎక్స్లో) పోస్ట్ చేశారు. భారత్ – భూటాన్ భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో ముందుకెళ్తానని చెప్పారు.

భూటాన్ కింగ్ ది ఫోర్త్ డ్రుక్ గ్యాల్పో, ప్రధానితో చర్చలు కోసం ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. అయితే షెడ్యూల్ ప్రకారం గురువారమే బయలుదేరాల్సి ఉన్నా భూటాన్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించక ప్రధాని ప్రయాణం వాయిదా పడింది. ‘నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ’పై భారత వైఖరిని పునరుద్ఘాటించడమే ఈ పర్యటన ఉద్దేశం. ప్రధాని మోదీ తిరిగి శనివారం స్వదేశానికి బయలుదేరనున్నారు.

అధిక రాబడి కలిగిన దేశంగా భూటాన్‌ ఎదిగేందుకు భారత్‌ కట్టుబడి ఉందని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇటీవలే ఇరు దేశాల ప్రధాన మంత్రులు భేటీ అయిన విషయం తెలిసిందే. భారత్‌-భూటాన్‌ మధ్య ఉన్న సౌర, పవన విద్యుత్తు, గ్రీన్‌ హైడ్రోజన్‌ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు ఇరుదేశాల ప్రధానమంత్రులు అంగీకరించారని మోదీ-తోబ్గే సమావేశం జరిగిన తర్వాత ఇరు దేశాలు ప్రకటన విడుదల చేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version