మీ పని పూర్తయిన వెంటనే సిస్టమ్స్‌ లాగౌట్ చేస్తారా..?: మోదీ

-

డిజిటల్ రంగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకు పెచ్చుమీరుతున్న డిజిటల్ దాడులు, సైబర్ మోసాలపై ఆయన తాజాగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు ఓ కీలక సూచన చేశారు. ప్రపంచంలో జీవిస్తోన్న మనం నిత్యం హ్యాకింగ్, సైబర్ మోసాలు, వైరస్ దాడుల గురించి వింటున్నామని.. అందుకే పని పూర్తయిన వెంటనే సిస్టమ్స్ లాగౌట్ చేయాలని మోదీ చెప్పినట్లు ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

‘‘రోజూ పని పూర్తయిన వెంటనే మీ సిస్టమ్స్ లాగౌట్ చేస్తారా..? నేను చేస్తాను. సైబర్ భద్రత విషయంలో ఇది చాలా ముఖ్యం’’ అని మోదీ హెచ్చరించినట్లు ఈ కథనం పేర్కొంది. రోజు చివర్లో అన్ని సిస్టమ్స్ లాగౌట్‌ అయ్యాయా..? లేదా..? చూసుకొనే పనిని ప్రతీ ఆఫీస్‌లో ఒక వ్యక్తికి అప్పగించాలని చెప్పారు. ఇంటికి వెళ్లేప్పుడు తన సిస్టమ్‌ను తానే లాగౌట్‌ చేసుకుంటానని తెలిపారు. వాటిని ఓపెన్ చేసి ఉంచటం వల్ల సైబర్ దాడుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులకు ఆయన చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version