హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 800 పెరిగి రూ. 68,400కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 870 పెరగడంతో రూ. 74,620 పలుకుతోంది.
కేజీ వెండి ధర ఏకంగా రూ. 4,000 పెరిగి రూ. 96,500కు చేరింది. త్వరలోనే కేజీ సిల్వర్ రేటు రూ. లక్ష పలికే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 73, 740 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 67, 590 గా పలుకుతుంది.