ఛత్తీస్​గఢ్​లో అల్లర్లు.. కలెక్టరేట్​లో 200వాహనాలకు నిప్పు

-

ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబజార్‌లో ఓ వర్గం చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. కలెక్టరేట్​ను ముట్టడించేందుకు వస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. ఈ క్రమంలోనేకొంతమంది నిరసనకారులు కలెక్టరేట్​లో ఆవరణలోకి చొరబడి అక్కడున్న 200 వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు గాయపడినట్లు సమాచారం.

గత నెలలో గిరోద్‌పురి ప్రాంతంలోని ఒక వర్గానికి చెందిన మతపరమైన స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఆ వర్గానికి చెందిన వేలాది మంది ప్రజలు దసరా మైదానంలో చాలా రోజులుగా నిరసనలు చేస్తూ ఘటనకు కారణమైనవారిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం కలెక్టరేట్‌, జిల్లా పంచాయతీ కార్యాలయాలను ముట్టడిని చేపట్టగా ఆ నిరసన రణరంగగా మారింది. దీనిపై స్థానిక పోలీసులు స్పందిస్తూ.. నిరసనకారులను అడ్డుకునేందుకు భారీ భద్రత ఏర్పాటు చేసి బారికేడ్లు కూడా పెట్టామని కానీ వారిని అడ్డుకోవడంలో విఫలమయ్యామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version