ఈ వానాకాలంలో దక్షిణ భారత్​లోనే ఎక్కువ వర్షాలు

-

దక్షిణ భారత రైతులకు తీపికబురు. ఈ ఏడాది వర్షాకంలో ఉత్తర భారతంతో పోలిస్తే.. దక్షిణాదిని వరుణుడు ఎక్కువగా కటాక్షించే అవకాశాలు ఉన్నాయని ద సౌత్‌ ఆసియా క్లైమేట్‌ అవుట్‌లుక్‌ ఫోరమ్‌ (ఎస్‌ఏఎస్‌సీఓఎఫ్‌) తెలిపింది. ఆ సంస్థ అంచనాల ప్రకారం, దేశంలో 18.6% జనాభా.. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం, 12.7% జనాభా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం చూస్తారు. ఉత్తర భారత ప్రాంతాల్లో సాధారణం కంటే 52% తక్కువ వర్షపాతం నమోదయ్యే సంభావ్యత ఉంది. దక్షిణ, తూర్పు భారత ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 50% అధికంగా ఉన్నాయని తెలిపింది.

అయితే ఇప్పటికే ఈ ఏడాది వేసవిలో అకాల వర్షాలు దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను వణికించిన విషయం తెలిసిందే. అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లోని పంట నేలరాలింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలను భానుడి భగభగలు తీవ్ర తిప్పలు పెడుతున్నాయి. ఈ క్రమంలో వానాకాలంలో దక్షిణాదిలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయన్న వార్త రైతులకు చల్లని కబురు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version