ఉక్రెయిన్ అధ్యక్షుడికి థాంక్స్ చెప్పిన ప్రధాని మోదీ

-

రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత ప్రధాన నరేంద్ర మోదీ… ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీతో ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితి గురించి ఇరు నేతలు చర్చించుకున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను జెలన్ స్కీ మోదీకి వివరించారు. ఇరు నేతలు దాదాపు 35 నిమిషాల పాటు సంభాషించుకున్నారు. 

మరోవైపు రష్యా- ఉక్రెయిన్ మధ్ జరుగుతున్న చర్చలపై కూడా ప్రధాని మాట్లాడారు. ఇరు పక్షాలు చర్చించుకోవడాన్ని మోదీ స్వాగతించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు సహకించినందుకు జెలన్ స్కీకి థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం తూర్పు ప్రాంతం సుమీలో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు సహకరించాలని జెలన్ స్కీని ప్రధాని కోరారు.

ఇదిలా ఉంటే మరోవైపు రష్యా అధినేత పుతిన్ తో కూడా ఈరోజు ప్రధాని మోదీ మాట్లాడనున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈరోజు రష్యా- ఉక్రెయిన్ మూడో దశ చర్చలు జరుగుతున్న సందర్భంగా ప్రధాని ఇరు దేశాల నేతలకు ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news