WC2023 : సచిన్ టెండూల్కర్‌కు గోల్డెన్ టికెట్

-

బీసీసీఐ సెక్రటరీ జైశా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు గోల్డెన్ టికెట్ అందజేశారు. ‘గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్’ కార్యక్రమంలో భాగంగా షా… సచిన్ కు గోల్డెన్ టికెట్ ఇచ్చినట్లు బీసీసీఐ ట్విట్టర్ లో ప్రకటించింది. ఇప్పటికే సినీ దిగ్గజం, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు ఈ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టికెట్ ద్వారా వరల్డ్ కప్-2023 మ్యాచ్లను ఉచితంగా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

Sachin Tendulkar Golden Ticket WC 2023

కాగా, అక్టోబర్ 5 నుంచి భారత్ లోని అహ్మదాబాద్ వేదిక WC ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ లు చూసేందుకు ఫ్యాన్స్ కోసం బీసీసీఐ 4 లక్షల టికెట్లను విక్రయించనుంది. టికెట్ల విక్రయం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. వీటిని ప్రపంచకప్ వెబ్సైట్ లో కొనుగోలు చేయవచ్చు. దీని తర్వాత మరో విడత టికెట్లను విక్రయించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఆగస్టు 24న మొదటి విడత టికెట్లను విక్రయించగా నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version