దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఓ వైపు పలు రాష్ట్రాల్లో నిత్యం నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయినప్పటికీ టీకాల పంపిణీ మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు టీకాలను తీసుకున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోగా.. దానికి సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో ఇచ్చారు. కాగా సైఫ్ అలీ ఖాన్‌ను ప్రస్తుతం నెటిజన్లందరూ విమర్శిస్తున్నారు.
రెండో దశ కోవిడ్ వ్యాక్సినేషన్‌లో 60 ఏళ్లకు పైబడిన వారితోపాటు 40 ఏళ్లకు పైబడి వయస్సు ఉండి, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రమే వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు. అయితే ఈ రెండింటిలో సైఫ్ ఏ జాబితాకు చెందుతాడు ? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సైఫ్ తాజాగా ముంబైలో ఓ సెంటర్‌లో కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఎంతో మంది వృద్దులు ఇంకా క్యూలోనే ఉన్నారని, అయినప్పటికీ సైఫ్‌కు ఇంత త్వరగా వ్యాక్సిన్ ఎలా లభించింది ? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram
కాగా సైఫ్ అలీ ఖాన్, కరీనాలకు ఇటీవలే మరో కుమారుడు జన్మించాడు. ఇక సైఫ్ త్వరలో భూత్ పోలీస్, బంటీ ఔర్ బబ్లీ 2, ఆది పురుష్ మూవీల్లో కనిపించనున్నాడు.