మనీశ్‌ సిసోదియా బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన సుప్రీంకోర్టు

-

దిల్లీ లిక్కర్ స్కామ్​కు సంబంధించి అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో అరెస్టయిన ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాకు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో 338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలు సమర్పించిందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభమైనందున ఈ దశలో బెయిల్ ఇవ్వడం కుదరదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

అయితే, ఈ కేసు విచారణను 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ నిదానంగా సాగితే.. సిసోదియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు సూచించింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన మనీశ్ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు మార్చి 9వ తేదీన ఈడీ కూడా సిసోదియాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన కస్టడీపై తిహాడ్ జైల్లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version