బంగ్లాదేశ్‌ లో ఉద్రిక్తతలు..భారతీయ పౌరుల కోసం కేంద్ర హెల్ప్‌ లైన్ నంబర్లు !

-

బంగ్లాదేశ్‌ లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా…బంగ్లాదేశ్‌ సర్కార్‌ పై అక్కడి విద్యార్థులు, నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు. అయితే..బంగ్లాదేశ్ లోని పరిణామాల పై భారత పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర సర్కార్‌. బంగ్లాదేశ్ లోని పరిణామాల దృష్ట్యా, ఆ దేశానికి భారతీయులు ఎవరు వెళ్ళొద్దని కేంద్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

The center has issued warning to Indian citizens on developments in Bangladesh

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయ పౌరులందరూ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఆ దేశంలో ఉన్న వాళ్ళు తమ కదలికలను తగ్గించుకుని సురక్షిత ప్రాంతాలకు పరిమితం కావాలని కేంద్రం తెలిపింది. ఏదయినా సాయం కోసం బంగ్లాదేశ్ ఢాకాలోని భారత హైకమిషన్‌ అత్యవసర ఫోన్ నంబర్‌ల ద్వారా సంప్రదించాలని కోరింది.

ఢాకా లోని భారత హైకమిషన్ ఫోన్ నంబర్లు
+8801958383679
+8801958383680
+8801937400591

Read more RELATED
Recommended to you

Exit mobile version