సాధారణంగా ఎవరైనా పోలీసులను చూస్తుంటేనే భయపడుతారు. అయితే ఈ మధ్య ప్రభుత్వాలు ప్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అంటూ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలు అవుతుంది. ఎంత ప్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అయినా ప్రజలకు పోలీసులు శత్రువుల లాగే కనిపిస్తుంటారు. కొందరూ పోలీసులు అయితే ఊరికే చితకబాదుతుంటారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా చాలానే జరుగుతున్నాయి.
తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో పోలీస్ కానిస్టేబుల్ ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన సోదరి వేధింపులకు గురి చేశాడనే కారణంతో కానిస్టేబుల్ రింకూ రాజౌరా ఆ వ్యక్తి పై దారుణంగా దాడి చేసినట్టు సమాచారం. ఈ వీడియో పై ఘజియాబాద్ పోలీసులు స్పందించి.. సదరు కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. ఇక ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్టు తెలిపారు.