బలపరీక్షలో తప్పక విజయం సాధిస్తాం – ఏక్నాధ్ షిండే

మహారాష్ట్ర రాజకీయాల్లో దాదాపు పది రోజుల పాటు కొనసాగిన అనిస్థితి, అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ముగిసింది. ఇక ఆయన తన ప్రభుత్వానికి ఉన్న బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అందుకు గవర్నర్ సోమవారం వరకు గడువు విధించారు. జూలై 4న నిర్వహించే విశ్వాస పరీక్షపై అందరి దృష్టి నెలకొంది. బలపరీక్షలో తప్పక విజయం సాధిస్తామని సీఎం షిండే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం గోవాలో ఉన్న శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు రేపు ముంబై కి చేరుకుంటారని చెప్పారు. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఆ సంఖ్య మరింత పెరుగుతుందని షిండే విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమకు పూర్తి మెజారిటీ ఉందని ముఖ్యమంత్రి షిండే చెప్పారు. మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సమావేశంలో స్పీకర్ ను ఎన్నుకొని, తర్వాత ప్రభుత్వం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.