శభాష్‌ యోగీజీ-ప్రపంచ బ్యాంక్‌

-

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీర్తిప్రతిష్టలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. రాష్ర్టంలో అరాచక శక్తులను అణచివేయడంలో బుల్డోజర్‌లను వినియోగించిన యోగీ శాంతిభద్రతల స్థాపనకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక పరిపాలన విధానంతో అతి తక్కువ కాలంలోనే యోగీ ప్రజల మన్ననలు అందుకున్నారు. రక్షణ లేక బయటికి అడుగు పెట్టాలంటే భయపడుతున్న మహిళలు ప్రస్తుతం ధైర్యంగా తిరగగలుగుతున్నారు.అటు మోడీ ఆశయాలకు అనుగుణంగా నూతన సంస్కరణలు తీసుకువచ్చి పరిపాలనను సులభతరం చేశారు.అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తూ ఆదరాభిమానాలు చూరగొన్న యోగీ ఆదర్శ సీఎంగా ఉన్నారు.

మొన్నామధ్య ఇండోనేషియాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన యోగీని అక్కడివారు ప్రశంసలతో ముంచెత్తారు.తాజాగా ప్రపంచబ్యాంక్‌ ప్రతినిథులు కూడా ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ర్టంలోని ప్రస్తుత పరిస్థితులు,విధివిధానాలు తెలుసుకున్నాక సీఎంని పొగడ్తలతో ముంచెత్తారు.ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో భాగంగా 20 మందితో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిథుల బృందం రాష్ర్టానికి విచ్చేశారు.యుపీ విజన్‌ అయిన ట్రిలియన్‌ డాలర్‌ల ఎకానమీ గురించి తెలుసుకుని ముఖ్యమంత్రికి వారు అభినందనలు తెలిపారు.యోగీ ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి అయ్యాక గత ఆరేళ్ళలో రాష్ర్టంలో జరిగిన అభివృద్ధి,మౌళిక సదుపాయాల కల్పన, పారిశ్రామికీకరణ,చెత్త పదార్ధాల తొలగింపు,పేదరిక నిర్మూలన,నగరాల ఆధునికీకరణ వంటి అంశాల గురించి ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు తెలుసుకున్నారు.ప్రత్యక్షంగా యుపీలోని పలు నగరాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి సంతోషం వ్యక్తపరిచారు.

ఉత్తరప్రదేశ్‌లో వన మహోత్సవ్‌ పేరుతో రికార్డు స్థాయిలో ఇటీవల మొక్కలు నాటారు. కేవలం మొక్కలను నాటి వదిలివేయడం కాకుండా వాటిని పెంచే బాధ్యతను ప్రజలకు అప్పగించారు యోగీ.ఈ విషయంపై ఆరా తీసిన ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిథులు సీఎం యోగీపై పొగడ్తలు కురిపించారు.శభాష్‌ యోగీ అంటూ అభినందనలు తెలిపారు.త్వరలోనే ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టం ట్రిలియన్‌ డాలర్‌ల ఎకానమీగా అభివృద్ధి చెందాలని,ప్రపంచ బ్యాంకు నుంచి తగిన సహకారం అందిస్తామని ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌ కి రావడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version