వైఎస్సార్ తనకు తండ్రిలా మార్గనిర్దేశం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కడప సభలో తెలిపారు. రాజీవ్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి అన్నదమ్ముల్లా ఉండేవారు. వైఎస్సార్ ఏపీకే కాదు.. దేశానికి మొత్తం దారి చూపించారని తెలిపారు. నా భారత్ జోడో పాదయాత్రకు ఆయన స్ఫూర్తి అని.. దేశమంతా పాదయాత్ర చేయాలని.. అప్పుడే ప్రజల సమస్యలు తెలుస్తాయని వైఎస్సారే నాకు చెప్పారని రాహుల్ గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏపీకీ పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. కడప సభలో ఆయన మాట్లాడుతూ.. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలన్ని నెరవేర్చే బాధ్యత మాది. పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ఇస్తాం,.. సీబీఐ ఛార్జీ షీటులో వైఎస్సార్ పేరును కాంగ్రెస్ చేర్చలేదు. కొందరూ స్వలాభం కోసం ఇలా ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ సిద్ధాంతాలు పార్లమెంట్ వినిపించాలనే షర్మిలను గెలిపించాలని కోరారు రాహుల్ గాంధీ.