ఒలింపిక్స్ : ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన నీరజ్..!

-

ప్యారిస్ ఒలంపిక్స్ లో మెడల్ కాదు తప్పకుండ గోల్డ్ మెడల్ సాధిస్తాడని భారతీయులకు అందరికి అంచనాలు ఉంది ఎవరి పైన అంటే అది నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ ప్యారిస్ లో కూడా అదే రిపీట్ చేస్తాడు అని అందరూ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆగస్టు 8న జరిగే పురుషుల జావెలిన్ త్రో ఫైనల్స్ కోసం ప్రస్తుతం జరుగుతున్న క్వాలిఫికేషన్ లో నీరజ్ అదరగొట్టాడు అనే చెప్పాలి.

84 మీటర్ల ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ తో జరుగుతున్న ఈ క్వాలిఫిర్స్ లో గ్రూప్ B లో ఉన్న నీరజ్ చోప్రా తన మొదటి త్రోలోనే 89.34 మీటర్ల అద్భుతమైన త్రో విసిరాడు . దాంతో ఫైనల్స్ లో తన స్థానం పక్క చేసుకున్నాడు. అయితే ఇప్పటివరకు అయితే క్వాలినికేషన్ రౌండ్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్న నీరజ్ చోప్రా ఫైనల్స్ లో ఏవిధమైన ప్రదర్శన చేస్తాడు అనేది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version