ధర్మపురిలో కొప్పులకు చిక్కులు..మళ్ళీ ఛాన్స్ కష్టమేనా?

-

కొప్పుల ఈశ్వర్..తెలంగాణ మంత్రి..టి‌ఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేత..కే‌సి‌ఆర్ తో కలిసి టి‌డి‌పి నుంచి బయటకొచ్చిన నాయకుడు. కే‌సి‌ఆర్ మాదిరిగానే కొప్పుల సైతం టి‌డి‌పి ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. ఇక 1994లో మేడారం(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అలా టి‌డి‌పి నుంచి గెలుస్తూ వచ్చిన ఆయన..2001లో టి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు.

తెలంగాణ ఉద్యమం మొదలైన నేపథ్యంలో కే‌సి‌ఆర్ తో కలిసి ముందుకెళ్లారు. ఇక 2004లో టి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గం ఏర్పడింది..ఇక అక్కడ నుంచి కొప్పుల గెలుస్తూ వచ్చారు. 2009లో విజయం సాధించారు..2010 ఉపఎన్నికలో కూడా ఆయన సత్తా చాటారు. తెలంగాణ వచ్చాక కూడా 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అలాగే కే‌సి‌ఆర్ క్యాబినెట్ లో మంత్రిగా చేస్తున్నారు.

అయితే గత ఎన్నికల్లో కొప్పుల ఓటమి అంచు వరకు వచ్చి గెలిచారు. చివరికి 441 ఓట్లతో గెలిచి బయటపడ్డారు. కొందరు అధికారులు ఫలితాన్ని తారుమారు చేసి కొప్పుల గెలిచేలా చేశారని, రీకౌంటింగ్ చేయాలని అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ నేత లక్ష్మణ్ కుమార్ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇటీవల కూడా..ధర్మపురి కౌంటింగ్ పై కోర్టు..పలు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.  మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై ఎన్నికల పిటిషన్‌ను అమలు చేయడంలో విఫలమైనందుకు తెలంగాణ హైకోర్టు మల్కాజ్ గిరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కి సమన్లు ​​జారీ చేసింది. రిటర్నింగ్ అధికారి మంత్రికి అనుకూలంగా ఫలితాల షీట్‌ను మార్చారని ఆరోపించారు.

అంటే ఇప్పటికీ కొప్పుల గెలుపుపై సందిగ్ధం ఉంది. కానీ ఎలాగో ఎన్నికల సమయం దగ్గరపడిపోయింది..కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లోనే కొప్పుల భవితవ్యం తేలనుంది. అయితే ఈ సారి కొప్పుల గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కొప్పులకు చెక్ పెట్టేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news