నెట్‌ఫ్లిక్స్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. 2 రోజుల పాటు ఉచిత స్ట్రీమింగ్‌..

-

ప్ర‌ముఖ స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ భార‌త్‌లోని యూజ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. 2 రోజుల పాటు అందులో దేన్న‌యినా యూజ‌ర్లు ఉచితంగానే చూడ‌వ‌చ్చు. డిసెంబ‌ర్ 5, 6 తేదీల్లో ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంద‌ని తెలిపింది. కొత్త యూజ‌ర్లు లేదా ఇప్ప‌టికే మెంబ‌ర్‌షిప్ ఎక్స్‌పైర్ అయిన యూజ‌ర్లు కూడా అందులో ఆయా తేదీల్లో ఉచితంగా వీడియోలు, సినిమాల‌ను చూడ‌వ‌చ్చ‌ని తెలియజేసింది.

ఇక యూజ‌ర్లు ఈ ఆఫ‌ర్‌ను అందుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో త‌మ పేరు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబ‌ర్‌ల‌ను ఎంట‌ర్ చేసి రిజిస్ట‌ర్ చేసుకోవాలి. అయితే ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే ఈ అవ‌కాశాన్ని అందిస్తున్నందున యూజ‌ర్లు వేగంగా రిజిస్ట‌ర్ చేసుకుని నెట్ ఫ్లిక్స్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. యూజ‌ర్లకు వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీ స్టాండ‌ర్డ్ డెఫినిష‌న్ (ఎస్‌డీ) రూపంలో ల‌భిస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ ఆఫ‌ర్‌లో భాగంగా యూజ‌ర్లు స్ట్రీమింగ్‌ను ఏ డివైస్‌లో అయినా యాక్సెస్ చేయ‌వ‌చ్చు. ఐఫోన్, ఆండ్రాయిడ్‌, స్మార్ట్ టీవీ, గేమింగ్ క‌న్సోల్‌, క్రోమ్ క్యాస్ట్‌, బ్రౌజ‌ర్‌.. ఇలా ఏ మాధ్య‌మంలో అయినా ఈ ఆఫ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే దీనికి గాను ఎలాంటి పేమెంట్ వివ‌రాల‌ను కూడా న‌మోదు చేయాల్సిన ప‌నిలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version