Ageas Federal Life Insurance సరికొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది. ఈ ప్రైవేట్ రంగానికి చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అస్యూర్డ్ ఇన్‌కమ్ ప్లాన్ వివరాలను చూస్తే.. అస్యూర్డ్ ఇన్‌కమ్, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, సేవింగ్ ప్లాన్ తో ఉందిది. దీని వలన ఆర్ధిక ఇబ్బందులు నుండి బయట పడచ్చు.
ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకే Ageas Federal Life Insurance ఈ స్కీమ్ ని తీసుకు వచ్చింది. ఒకవేళ పాలసీదారుడు మరణించిన కూడా ఈ స్కీమ్ ఆర్ధిక భరోసా ఇస్తుంది. అస్యూర్డ్ ఇన్‌కమ్ ప్లాన్ గ్యారెంటీ రిటర్నులను ఇస్తుంది. సాధారణంగా మనం జీవితంలో ఎన్నో దాటుతూ ఉండాలి. పిల్లల చదువులు లేదంటే వ్యాపారం ఇలా ఏదైనా.
ఇలాంటి వాటికి ఇది మనకు ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ లో మూడు రకాల ఆప్షన్స్ వున్నాయి. వీటిలో ఎంపిక చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ఇన్‌కమ్, లాంగ్ టర్మ్ ఇన్‌కమ్, లైఫ్ లాంగ్ ఇన్‌కమ్ లో నచ్చినది సెలెక్ట్ చేసుకోచ్చు. షార్ట్ టర్మ్ ఇన్‌కమ్ పదేళ్ల ఫిక్స్‌డ్ టెన్యూర్‌కు గ్యారెంటీడ్ రెగ్యులర్ ఇన్‌కమ్. 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు లాంగ్ టర్మ్. అదే లైఫ్ లాంగ్ ని ఎంపిక చేసుకుంటే వందేళ్ల వరకు లభిస్తాయి.