ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా రైల్వే ప్రాజెక్టులను ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తీర్చి చెప్పింది. ఇందుకు గల కారణాలను కూడా తెలిపారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరనే దీనికి కారణమని తెలిపారు. వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఏపీలో ప్రస్తుతం 70 వేల కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని, కొత్త ప్రాజెక్టులను కాస్ట్ షేరింగ్ పద్ధతిన చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఏపీ తన వాటాగా 1798 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనందువల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీకి కొత్త రైల్వే ప్రాజెక్టులు ప్రకటించడం సాధ్యం కాదని తెలిపారు.