ప్రతీ నెలా కూడా కొన్ని కొత్త రూల్స్ వస్తూ ఉంటాయి. అలానే ఈ నెల లో కూడా కొన్ని మార్పులు రానున్నాయి. ఇప్పుడు మే నెల ముగియనుంది. జూన్ నెల ప్రారంభం అవ్వబోతోంది. ప్రతి నెల లాగే ఈ నెల లో కూడా కొత్త కొత్త నిబంధనలు రానున్నాయి. ఈ నిబంధల వల్ల మీకు కొంత ఆర్థికంగా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. అందుకే జూన్ నెల నుంచి ఏయే కొత్త రూల్స్ రాబోతున్నాయి అనేది చూద్దాం. ఆధార్ కార్డు, పెట్టుబడులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు మొదలు విదేశ క్రెడిట్ కార్డు పేమెంట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్ వంటి అంశాలు వున్నాయి. ఇక మరి వాటి కోసం చూద్దాం.
ఫ్రీ ఆధార్ అప్డేట్ ని చేయడానికి యూఐడీఏఐ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. పేరు, అడ్రస్ వంటి వివరాలను ఆన్ లైన్ ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మార్చుకోవచ్చు. ఈ అవకాశం జూన్ 14 వరకు మాత్రమే అందుబాటులో వుంది. సో ఆలోగా చేసుకోండి. గడువు తర్వాత ఆన్‌లైన్ ద్వారా చేసినా రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలానే ప్రతీ నెల 1వ తేదీన చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరలను మారుస్తాయి. ఈ ధరల్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
లేకపోతే స్థిరంగా ఉంచవచ్చు. గత నెల వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గాయి. సో జూన్ లో కూడా తగ్గే అవకాశం వుంది. బ్యాంకుల్లో చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్, సేవింగ్స్, కరెంట్ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేసి వుంటారు. క్లెయిమ్ చేయిని వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు గానీ, నామినీలకు గానీ డబ్బులు అందించేలా చర్యలు చేపట్టింది. జూన్ ఒకటి నుండి ఇది మొదలు కాబోతోంది.
ఆర్బీఐ జూన్ 1 నుంచి 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ఇలా అన్‌క్లెయిమ్డ్ అమౌంట్‌ను సెటిల్ చేయనుంది. అదే విధంగా ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి జూన్ 1 నుంచి ఝలక్ తగలనుంది. కేంద్ర సర్కార్ అందిస్తున్న సబ్సిడీలో భారీ కోత విధించనుంది.