ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ కరోనా నేపథ్యంలో అన్ని దేశాలు ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయితే.. ఈ ఆంక్షాల కారణంగా… ఏకంగా ఓ ప్రధాని పెళ్లి రద్దు అయిపోయింది. అవును న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన పెళ్లిని కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు. కరోనా, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న్యూజిలాండ్ లో విపరీతంగా పెరిగిపోతున్నాయి.
దీనిని నివారించడానికి ఇవాళ్టి నుంచే న్యూజిలాండ్ లో ఆంక్షలను విధించింది ప్రభుత్వం. ఈ విషయాన్ని ప్రకటించడానికి జసిండా ఆర్డెర్న్ విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా అర్ధ రాత్రి నుంచే కరోనా ఆంక్షలు అమలులోకి వస్తాయని ప్రధాని స్పష్టం చేశారు. పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలకు 100 మంది మాత్రమే హాజరు కావాలని ఆదేశించారు. ఆంక్షల నడుమ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని వారు వాయిదా వేసుకోవాలని విజ్ఙప్తి చేశారు. తాను కూడా తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు ప్రధాని ప్రకటన చేశారు. దీంతో దేశ ప్రజలు షాక్ కు గురయ్యారు.