తెలుగు రాష్ట్రాల‌లో ఎన్ఐఎ సోదాలు

-

తెలుగు రాష్ట్రాల‌లో ఈ రోజు ఉద‌యం నుంచి ఎన్ఐఎ సోదాలు నిర్వ‌హించింది. రెండు తెలుగు రాష్ట్రాల‌లోని మొత్తం 14 ప్రాంతాల‌లో ఎన్ఐఎ సోదాలు నిర్వ‌హించింది. హైదరాబాద్, రాచకొండ, మెదక్ , ప్రకాశం, విశాఖపట్నం , విజయవాడ, నెల్లూరు పాటు ప‌లు ప్రాంతాల లో ఉదయం నుండి సోదాలు ఎన్ఐఎ సోదాలు నిర్వ‌హించింది. కాగ 2019 జూన్ లో ఛత్తీస్ ఘ‌ఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంట‌ర్ కేస్ దర్యాప్తు లో భాగంగా సోదాలు నిర్వ‌హించామ‌ని ఎన్ఐఎ అధికారింగా ప్ర‌క‌టించింది.

అప్పటి కూంబింగ్ ఆపరేషన్ లో 6 గురు మావోయిస్ట్ లతో పాటు ఒక పౌరుడు హతం. దీని పై ఛ‌త్తీస్ ఘ‌ఢ్ బాస్ట‌ర్ లో 2019 సంవ‌త్స‌రం లో ని జూన్ నెల‌లో ఛ‌త్తీస్ ఘ‌ఢ్ పోలీసులు ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేశారు. ఆనాటి ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా 2021 మార్చిలో ఎన్ కౌంట‌ర్ కేసు ను ఎన్ ఐ ఎ త‌న ఆధీనం లోకి తీసుకుంది. అందులో భాగంగా సంజు, లక్ష్మణ్, మున్ని, దాషరి పేర్లను ఎన్ఐఎ త‌న ఎఫ్ ఐ ఆర్ లో చేర్చింది. అందులో భాగంగా నే ఈ రోజు ఉద‌యం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల‌లో సోదాలు నిర్వ‌హించామ‌ని ఎన్ ఐ ఎ త‌న ప్ర‌క‌ట‌న లో తెలిపింది. ఈ సోదాలలో ప‌లు ప్రాంతాల‌లో ఎలాక్రానిక్ పరికరాలు, అనుమాన‌స్ప‌ద ప‌రిక‌రాలు, నిషేధిత‌ మావోయిస్ట్ సాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నాట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version