అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ లో మొదటి టైటిల్ ను న్యూయార్క్ ముంబై ఇండియన్స్ చేజిక్కించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సీటల్ ఆర్కాస్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించి ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట డీకాక్ 9 ఫోర్లు మరియు 4 సిక్సులతో 87 పరుగులు చేసి జట్టుకు ఛాలెంజింగ్ టోటల్ ను అందించాడు. ఆ తర్వాత జట్టు భారం అంతా నికోలస్ పూరన్ మీదనే పడింది. ఇతని మొదటి బంతినుండి హిట్టింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. సింగిల్ హ్యాండెడ్ గా వీరోచితంగా సెంచరీ సాధించి (137) ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఆడి ముంబై ఇండియన్స్ కు టైటిల్ ను అందించాడు. ఇతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు మరియు 13 సిక్సులు ఉన్నాయి. ఇతని దెబ్బకు ప్రత్యర్థి జట్టు బౌలర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది.