కాంగ్రెస్‌ పై మంత్రి నిరంజన్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు

-

కాంగ్రెస్‌ పై మంత్రి నిరంజన్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు ప్రపంచంలో ఎవరికి ఆలోచన రాలేదు… మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయ్యిచ్చు కదా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎందుకు వచ్చారు… తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల వారికి ఏ మాత్రం అవగాహన లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన 60ఏళ్ల అన్యాయలను ఎదిరించిది తెరాస అని.. కోట్లాది సాధించిన రాష్ట్రం ఇది… మీరు ఇచ్చెంది కాదు…. మేము బలిదానాలతో సాధించుకున్నదని చెప్పారు.

ఎప్పుడు చూసినా స్వాతంత్రం తెచ్చాం అని చెప్పుకోవడం కాదని మండిపడ్డారు. మీరు కాదు స్వాతంత్య్రం తెచ్చిందని.. స్వాతంత్ర ఉద్యమం లో మీ పాత్ర ఉంది… కానీ మొత్తం పాత్ర మీది కాదని నిప్పులు చెరిగారు. A.O హ్యూమ్ చేతిలో పుట్టిన పార్టీ ఇది… మీరు పెట్టింది కాదని చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీ ని అమ్మనా భూతులు తిట్టిన వారే … ఇప్పుడు సారథులు…అది మీ దుస్థితి అంటూ చురలకు అంటించారు. ప్రజలు ఏ ఎన్నికలు అయ్యిన మిమ్మల్ని తిరస్కరిస్తున్నారని మండి పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news