బడ్జెట్‌లో 7 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాం : నిర్మలా సీతారామన్‌

-

పార్లమెంట్‌ సమావేశాల్లో బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడ్జెట్‌లో 7 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రైతులు, మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని ఆమె తెలిపారు. గ్రీన్‌ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోంది. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా సంస్కరణలు తీసుకురానున్నట్లు ఆమె పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో సవాళ్లు ఎదుర్కొనేందుకు ప్రణాళిక చేసినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా.. దేశవ్యాప్తంగా 157 కొత్త నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఉచిత ఆహారధాన్యాల పంపిణీ కొనసాగిస్తామన్నారు. వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు, 81 లక్షల సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఆమె వెల్లడించారు.

గిరిజనులకు వివిధ సౌకర్యాలు కల్పించాలని 50 వేల కోట్లు కేటాయించామన్నారు. షెడ్యూల్ తెగలకు సాయం అందిస్తామని, ఏకలవ్య స్కూళ్ళలో 38,800 టీచర్లను 740 స్కూళ్లో నియమిస్తున్నామని ఆమె తెలిపారు. పీఎం ఆవాజ్ యోజన పెంచామన్నారు. జైళ్ళలో ఉండే పేద ఖైదీలకు బెయిల్ పొందేందుకు సాయం అందిస్తామన్నారు. వ్యవసాయంలో ఆధునీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు నిర్మలా సీతారామన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version