KCR కు అరెస్టులు తప్ప అభివృద్ధి చేతకాదు – వైఎస్ షర్మిల

-

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిల ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు చలో ఉస్మానియా ఆసుపత్రికి షర్మిల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాసేపటి క్రితం ఉస్మానియా ఆసుపత్రి సందర్శన కోసం నగరంలోని లోటస్పాండ్ లోని ఆమె నివాసం నుంచి బయటకు వచ్చిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డు తగిలారు. దీంతో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు.

ఈ తొక్కేసిలాటలో షర్మిల కింద పడిపోయారు. అనంతరం షర్మిలను బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో పండిపడ్డారు వైఎస్ షర్మిల. “KCR మరోసారి నియంత అని నిరూపించుకున్నారు. జనతా రైడ్ లో భాగంగా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తుండగా వందల కొద్దీ పోలీసులను పంపించి అక్రమంగా హౌజ్ అరెస్ట్ చేయించారు. ఎలాంటి ఆర్డర్ లేకుండానే హౌజ్ అరెస్ట్ చేయడం KCR దుర్మార్గ పాలనకు నిదర్శనం.

గతంలో పాదయాత్రను అడ్డుకొని, హౌజ్ అరెస్ట్ చేశారు. మొన్న TSPSC ముట్టడికి వెళ్తుండగా హౌజ్ అరెస్ట్ చేశారు. KCRకు అరెస్టులు తప్ప అభివృద్ధి చేతకాదు. వైయస్ఆర్ బిడ్డ అంటే ఎందుకంత భయం? ప్రజలపక్షాన ప్రశ్నిస్తుందనా? ఉస్మానియా ఆసుపత్రిలో రేకుల షెడ్డు కిందే వైద్యం చేస్తున్నా దొరకు సోయి లేదు. 200కోట్ల ఉస్మానియా హెల్త్ టవర్ దిక్కు లేదు” అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news