తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ ను తొలగించడం అసాధ్యం : కేసీఆర్

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపుగా 12 ఏళ్ల తర్వాత మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పుష్కర కాలం తర్వాత కేసీఆర్ ఇస్తున్న ఈ ఇంటర్వ్యూలో గత బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు, ప్రస్తుత కాంగ్రెస్ చేస్తున్న తప్పులు, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రాధాన్యత ఏంటి.. బీఆర్ఎస్ పార్టీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందా అనే విషయాలపై కేసీఆర్ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తరచూ తనపై చేస్తున్న విమర్శలపై స్పందించారు.

“తెలంగాణ చరిత్ర నుంచి నన్ను తొలగించాలని చూస్తున్నారు. కానీ మన రాష్ట్ర చరిత్ర నుంచి కేసీఆర్ ను తొలగించే సత్తా ఎవరికీ లేదు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా అన్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి. నన్ను లేకుండా చేస్తాం అని ఇప్పటికే చాలా మంది అన్నారు. వాళ్లిప్పుడు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలిసిందే. కేసీఆర్ ను అంతం చేయడం అంత ఈజీ కాదు. కేసీఆర్ ను తగ్గించాలనే ప్రయత్నం సాగదు. “అని కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version