రేపు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని కొన్ని రాష్ట్రాలలో మద్యం షాపులు , బార్లు, రెస్టారెంట్ లు బంద్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కర్ణాటక లోని బెంగళూర్ నగర పాలక సంస్థ ప్రజలకు మరో విధంగా షాక్ ఇచ్చింది. రేపు శ్రీరామనవమి కావడం వలన నగరంలో మాంసం అమ్మడం నిషేధించింది. అంతే కాకుండా నగరంలో నివసించే ప్రజలు సైతం మాంసం కూడా వండడానికి వీలు లేదని అధికారులు తెలిపారు.
BBMP నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోబడును అని సదర్ సంస్థ తెలియచేసింది. అయితే సాధారణంగా దేశంలో గాంధీ జయంతి మరియు ఇండిపెండెన్స్ మరియు రిపబ్లిక్ డే రోజున మాత్రమే మాంసం అమ్మడం నిసేదించేవారు. కానీ బెంగళూర్ లో మాత్రమే మహాశివరాత్రి మరియు శ్రీరామనవి రోజున మాంసం అమ్మడం బంద్ చేశారు.