అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో కృష్ణ, ఎన్టీఆర్ మధ్య జరిగిందిదే.!

-

సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు ప్రేక్షకులను కలచి వేస్తోంది. తన నటనతో ఎన్నో చిత్రాల లో నటించి ప్రేక్షకులను అలరించారు. తన నటనతో పాటు తన వ్యక్తిత్వం తో దైర్యం తో ఎంతో మంది అభిమానం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ , నాగేశ్వరరావు హీరోలు గా ఫుల్ జోష్ లో ఉన్న కాలంలో జూనియర్ గా కృష్ణ తెలుగు సినిమా పరిశ్రమ లోకి అడుగు పెట్టారు.

తర్వాత కాలంలో తనకంటూ ప్రత్యేక మైన స్టయిల్ తో వారితో సమానంగా గుర్తింపు పొందారు. అలాగే తన మొండి దైర్యం తో కొత్త ప్రయోగాలు చేసి హిట్స్ కొట్టేవారు. అప్పట్లో హీరోల మధ్య మంచి కాంపిటీషన్ ఉండేది. ఎవరైనా మంచి హిట్ కొడితే దానికంటే సూపర్ హిట్ తీయాలని కోరుకొనే వారు.వాస్తవానికి అల్లూరి సీతారామరాజు కథ  ఎన్టీఆర్ చేయాలని అనుకొనే వారట. కాని కృష్ణ కూడా ఆ కథ మీద మనసుపడి రచయితల తో కూర్చోని మంచిగా స్క్రిప్ట్ వర్క్ చేసుకున్నారట.

ఈ విషయం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ కృష్ణ గారిని పిలిచి నీ గొంతు సూట్ కాదు, మళ్లీ ప్లాప్ అయితే ఇబ్బంది అని చెప్పారట.కాని కృష్ణ గారు మాత్రం నటీ నటుల అందరితో అడవులకు వెళ్ళి మొండి దైర్యం తో సినిమా తీసారు. ఆ సినిమా విడుదల అయ్యి అప్పట్లో ట్రెండ్ సెట్టర్ హిట్ గా నిలిచింది.ఇది చూసి ఎన్టీఆర్ మళ్లీ అదే సినిమా తీయాలని కథ రెడీ చేయాలని, పరుచూరి బ్రదర్స్ కు చెబితే వద్దు సార్ అని వారించి కృష్ణ గారి సినిమా చూడమని చెప్పారట. కృష్ణ గారు కూడా  ఎన్టీఆర్ కోసం స్పెషల్ షో వేశారట. ఇది చూసి ఎన్టీఆర్ గారు చాలా బాగా తీశారు బ్రదర్, మళ్లీ మేము ఈ సినిమా తీయాల్సిన అవసరం లేదని కృష్ణ గారని అభినిందించారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version