తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవరాలి పెళ్లి వేడుక హైదరాబాద్ మహానగరంలో చాలా గ్రాండ్ గా జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి కుమార్తెలు ఇవాళ పెళ్లి కూతురు చేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా చేశారు. అంతే కాదు.. ఈ వివాహ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు, మనవరాళ్లు ఇతర కుటుంబ సభ్యులు హాజరై పెళ్లి కూతురుని ఆశీర్వదించారు.
అయితే ఈ వేడుకలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు… పెళ్లి వేడుకలో చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు.
రాజకీయ విభాగాలతో చాలాకాలంగా దూరంగా ఉంటున్న వీరు ఈ పెళ్లి వేడుకలో.. ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూసిన వారు అందరూ ఆశ్చర్యపోయారు. ఇక వారిద్దరూ పక్క పక్కన నిల్చుని ఫోటోలు కూడా దిగారు. దీని అంతటికి కారణం… బాలయ్య బాబు కృషి అంటూ టిడిపి నాయకులు చెబుతున్నారు. అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.