మరోసారి హాలిడే టూర్‌లో అల్లు అర్జున్‌.. తగ్గేదేలే

-

సైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప ది రైజ్‌ సినిమాతో రికార్డులు బద్దలు కొట్టడమే కాకుండా.. కొత్త కొత్త రికార్డులను నెలకొల్పింది. అయితే పుష్ప సీక్వెల్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతుండటంతో ఆయన కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లిన స్టైలిష్ స్టార్.. ఇప్పుడు మరోసారి హాలిడేకు వెళ్లారు. గురువారం ఉదయం ఆయన విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం అల్లు అర్జున్ కొన్ని రోజుల పాటు అమెరికాకు హాలిడే ప్లాన్ చేసినట్లు సమాచారం.

Allu Arjun Heads To The US For Another Vacation Before Starting Shoot For  Pushpa 2

ఇటీవలే కుటుంబంతో కలిసి సుదీర్ఘ విహారయాత్రను చేసిన అల్లు అర్జున్‌.. సతీమణితో పాటు కుమారుడు, కుమార్తేతో కలిసి లాంగ్ హాలిడేకు వెళ్లారు. ఈ పర్యటన తర్వాత పుష్ప2ను మొదలుపెట్టేస్తారనుకుంటే ఇంతలోనే మరోసారి టూర్ ప్లాన్ చేశారు ఐకాన్‌ స్టార్‌. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీలైనంత వేగంగా పుష్ప; ది రూల్‌ను మొదలుపెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రెగ్యూలర్ షూట్‌కు ముందు చిత్రబృందం ఘనంగా ప్రారంభ వేడుకను జరుపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అమెరికా ట్రిప్ ఎక్కువ రోజులు ఉండదని ఫిల్మ్ వర్గాల్లో టాక్‌. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి ఓ యాడ్ ఫిల్మ్ షూట్ కోసం ఈ ట్రిప్ కు వెళ్తున్నారని, హరీశ్ తో కలిసి ఆయన దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news