లేడీ పోలీసునే మోసం చేసిన ఘరానా మోసగాడు..

-

కేటుగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు సామాన్యులే కాకుండా పోలీసులు కూడా వారి బారిన పడుతుండటం గమనార్హం. ఓ లేడి పోలీస్‌ను బురిడి కొట్టించాడో ఘరానా మోసగాడు. మ్యాట్రి మోనియల్ మోసాల గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. పెళ్లి పేరుతో పరిచయం చేసుకొని, ఆ తర్వాత.. అవసరాల కోసం డబ్బులు లాగి,ఆ తర్వాత టోకరా ఇస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఉత్తర ప్రదేశ్ లో ఈ సంఘటన జరిగింది.

ఒక సునీతావర్మ మహిళ మీరట్ లోని గౌతమ్ బుద్ధనగర్ లో ఉంటుంది. అయితే, ఆమె భర్త చనిపోయారు. ఈ క్రమంలో ఆమె.. రెండో పెళ్లికోసం మ్యాట్రిమోనియల్ సైట్లలో అనేక మ్యాచెస్ లను చూస్తుంది. ఆ సమయంలో సంజయ్ సింగ్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. తాను ఒక ఎన్నారై అని.. ప్రస్తుతం ఢిల్లీలోని టెలికామ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పాడు. తన తల్లి కెనడాలో ఉంటుందని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత కెనడాలో వెళ్లి సెటిల్ అవుతామని చెప్పాడు.

నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. దీంతో.. బాధిత మహిళ అతగాడి మాటలను నమ్మింది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం తన మేనల్లుడికి యాక్సిడెంట్ అయ్యిందని తన ఏటీఎంలను కంపెనీ బ్లాక్ చేసిందని చెప్పాడు. దీంతో మహిళ 2 లక్షలు ఇచ్చింది. కొన్ని రోజుల పాటు అలాగే మాయ మాటలు చెప్పాడు. ఆ తర్వాత.. విడుతల వారిగా.. 60 లక్షల వరకు వసూల్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత.. తన లావాదేవీలను కంపెనీ బ్లాక్ చేసిందని చెప్పాడు. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో తాను మోసపోయానని… సునీత వర్మకు అనుమానం వచ్చింది. సునీత వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version