బ్రేకింగ్: తెలంగాణలో మరో నోటిఫికేషన్ విడుదల..

-

గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన విధంగానే తెలంగాణలోని ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం పూనుకుంది. దీంతో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తోంది తెలంగాణ సర్కార్. అయితే.. తాజాగా మరో నోటిఫికేషన్ ను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ స‌ద‌ర‌న్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (టీఎస్ఎస్‌పీడీసీఎల్‌) లో ఖాళీగా ఉన్న 1,271 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల అయ్యింది. తెలంగాణ విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ స‌ర‌ఫ‌రాలో టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఓ విభాగంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

అయితే.. ఈ నేపథ్యంలో.. తాజా నోటిఫికేష‌న్‌లో టీఎస్ఎస్‌పీడీసీఎల్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్లు (ఎల‌క్ట్రిక‌ల్‌) పోస్టులు 70, స‌బ్ ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్‌) 201, జూనియ‌ర్ లైన్‌మ‌న్ విభాగంలోని 1,000 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నెల 11 నుంచి ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఆ నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఆ శాఖ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version