తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజు కు పెరిగి పోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సర్కార్ అలర్ట్ అయింది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులను పొడగించిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 24 వ తేదీ అంటే రేపటి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లోని 8,9,10 తరగతుల విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్.
ఇక పాఠశాలలకు హాజరయ్యే ఉపాధ్యాయ, ఉపాధ్యేయతర సిబ్బంది కూడా రోటేషన్ పద్దతిలో 50 శాతం మంది మాత్రమే విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు సైతం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అమలు అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది సర్కార్. కాగా.. తెలంగాణలోని విద్యా సంస్థలకు ఈ నెల చివరి వరకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.