దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. ఈ రోజు.. నిన్నటితో పోలిస్తే.. దాదాపు 95 శాతం ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతున్నాయి. కాగ ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా వైరస్ బులిటెన్ విడుదల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య అధికారులు.. 1,375 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల ఫలితాల్లో కేవలం ఒక్క కరోనా పాజిటివ్ కేసు మాత్రమే వెలుగు చూసింది. అలాగే ఈ రోజు రాష్ట్రంలో కరోనా మరణాలు నమోదు కాలేదు. అలాగే గడిచిన 24 గంటల్లో ఒక్కరు కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కాగ దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మాస్క్, భౌతిక దూరంతో సహా కరోనా నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు.