ఆపరేషన్ గంగా: ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 15,900 మంది స్వదేశానికి.. రేపు మరో 8 విమానాలు

-

ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ‘ ఆపరేషన్ గంగా’ ద్వారా స్వదేశానికి తరలిస్తున్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలు హంగేరీ, రొమేనియా, పోలాండ్, స్లొవేకియా, మల్టోవా దేశాల నుంచి భారతీయ విద్యార్థులను ఏయిర్ లిఫ్ట్ చేస్తున్నారు. 2022 ఫిబ్రవరి 22న ప్రారంభం అయిన ఆపరేషన్ గంగ ద్వారా ఇప్పటి వరకు ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి 15, 900 మంది విద్యార్థులను ఇండియాకు తరలించినట్లుగా పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈరోజు 11 ప్రత్యేక విమానాల ద్వారా 2135 మంది భారతీయులను ఈరోజు తిరిగి తీసుకువచ్చారు. 

రేపు  8 ప్రత్యేక విమానాలను నడపనున్నట్లు పౌరవిమానయాన శాఖ తెలిపింది. ఇందులో బుడాపెస్ట్ నుండి 5 విమానాలు, సుసెవా నుండి రెండు విమానాలు మరియు బుకారెస్ట్ నుండి ఒక విమానంతో సహా 1500 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకువస్తాయని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ తెలిపింది. మరోవైపు హంగేరి నుంచి ఆపరేషన్ గంగా దాదాపుగా ముగింపుకు చేరకుంది. భారతీయులతో కూడిన చివరి విమానం ఈ రోజు బయలుదేరుతుందని… అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. వేర్వేరు చోట్ల ఉన్న వారంతా.. బుడాపెస్ట్ కు చేరుకోవాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version