వామ్మో.. కారు ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.122 కోట్లు

-

దుబాయ్‌లో జరిగిన “మోస్ట్ నోబుల్ నంబర్స్” వేలంలో ‘P7’ అనే కారు నంబర్​ ప్లేట్​ ఏకంగా 55 మిలియన్​ దిర్హమ్​లకు ​(దాదాపు 122 కోట్ల రూపాయలకు) అమ్ముడుపోయింది. ఫ్రెంచ్-ఎమిరాటీ వ్యాపారవేత్త, టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకులైన పావెల్ వాలెరివిచ్ దురోవ్.. ఈ నంబర్ ప్లేట్‌ను సొంతం చేసుకున్నారు. జుమేరాలోని ఫోర్ సీజన్స్ హోటల్​లో ఈ వేలం పక్రియ జరిగింది.

మొదట 15 మిలియన్​ దిర్హమ్​ల​ (దాదాపు 33.5 కోట్ల రూపాయలు) వద్ద ఈ నంబర్​ ప్లేట్​ వేలం ప్రారంభమైంది. కాసేపటికే 55 మిలియన్​ దిర్హమ్​లకు చేరుకుంది. P7తో పాటు మిగతా వీఐపీ నంబర్​ ప్లేట్లు, ఫోన్​ నంబర్​లకు కూడా వేలం జరిగింది. ఈ వేలంతో మొత్తం 100 మిలియన్​ దిర్హమ్​లు (223 కోట్ల రూపాయలు) సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఎమిరేట్స్ వేలం, దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, ఎటిసలాట్ అండ్​ డు అధ్వర్యంలో ఈ వేలం పక్రియ జరిగింది.

ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం వన్ బిలియన్ మీల్స్ ప్రచారానికి వెళుతుందని అధికారులు తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న ప్రజల కోసం కృషి చేస్తుందని వారు వెల్లడించారు. అందుకోసం ఈ సంస్థ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version