తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు అంశం కాకను రాజేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణకు దారితీసింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్దానికి దారితీసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర నిరసన, ఆందోళన నిర్వహించారు. లోక్ సభ, రాజ్య సభల్లో స్పీకర్ పోడియం ముందు నినాదాలు చేస్తూ కేంద్రానికి నిరసన తెలియజేశారు. ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని పలుమార్లు వాయిదా తీర్మాణాలను కూడా ఇచ్చారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోవడానికి నిరసనగా.. నిన్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య వల్ల అయినా కేంద్రంపై ఒత్తడి పెరుగుతుందని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.
తాజాగా పార్లమెంట్ లో పరిణామాలపై ఎంపీలు సీఎం కేసీఆర్ కు వివరించనున్నారు. ఈరోజు కేసీఆర్ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించినా.. ఈనెల 23 వరకు సమావేశాలు జరుగుతాయి కాబట్టి తమ నిరసనను పార్లమెంట్ బయట నిరసన తెలియజేసే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ లో మీటింగ్ లో ప్రజాపోరాటాలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.