కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో తెలంగాణ మంత్రులు, ఎంపీలు భేటీ… ధాన్యం కొనుగోలే ప్రధాన ఎజెండా

-

ధాన్యం కొనుగోలపై తెలంగాణ.. కేంద్రంపై ఒత్తడి పెంచబోతోంది. ఇప్పటికే ధాన్యం కొనుగోలపై పోరుబాట పట్టాలని టీఆర్ఎస్ నాయకత్వం పార్టీ నేతలకు దిశానిర్థేశం చేసింది. ఇటీవల టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్…ధాన్యం కొనుగోలుపై పార్టీ నేతలకు నిరసన, ఆందోళన కార్యక్రమాలను గురించి దిశానిర్థేశం చేశారు. ఇప్పటికే తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో మకాం వేశారు. ఇప్పటికే కేంద్రమంత్రి పియూష్ గోయల్ అపాయింట్మెంట్ కోరగా ఈరోజు తెలంగాణ మంత్రులు, ఎంపీలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. 

దీంతో ఈరోజు కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో తెలంగాణ మంత్రులు, ఎంపీలు మధ్యాహ్నం 2.30 గంటలకు భేటీ కానున్నారు. తెలంగాణలో ప్రస్తుత యాసింగిలో సాగవుతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రమంత్రిని కోరనున్నారు. అయితే ఇప్పటికే కేంద్రం తన స్టాండ్ ను ప్రకటించింది. నిన్న పీయూష్ గోయల్ ధాన్యం కొనుగోలుపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రాల్లో సాగవుతున్న మొత్తం ధాన్యాన్ని కొనే వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే భేటీ అనంతరం మంత్రులు, ఎంపీలు ఎలాంటి కార్యాచరణ ప్రారంభిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version