పాటలు పాడుకునే మొగిలయ్యకు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని చూసి ఈ జాతి గర్విస్తుందని చెప్పాడు కేసీఆర్.పాటలు పాడుకునే మొగిలయ్యను చూసి ప్రాచీన కళల రక్షణ నా బాధ్యత అని చెప్పాడు కేసీఆర్. మంచి వాడవు నీవు ఇలానే ఉండాలి అని కూడా ప్రశంసించాడు కేసీఆర్. కోటి రూపాయలు ప్రభుత్వం తరఫున ఇచ్చి మొగిలయ్యా! నీవు ఇంకా ఈ కళ ను విశ్వ వ్యాప్తం చేయాలి అని భుజం తట్టాడు కేసీఆర్..మంచివాడు కేసీఆర్.. భోళా మనిషి.. కోటి రూపాయలు ఇచ్చి ముందు నీవు ఆ రేకింటి నుంచి బయటకు రా! మంచి ఇల్లు కట్టుకో! ఏమయ్యా! వింటున్నావా! అంటూ ఆయన నవ్వులో నవ్వయ్యాడు.. ఆయన వెలుగులో వెలుగయ్యాడు. మంచి వాడు కేసీఆర్.. ఏమయ్యా! పింఛను వస్తుంది కదా! డబ్బులు జాగ్రత్త! నీకు మన ఎమ్మెల్యేలు అంతా అండగా ఉంటారు..ఈ తెలంగాణ జాతి జాతంతా నీకు అండగా ఉంటారు అని చెప్పి పంపారు కేసీఆర్.
కేసీఆర్ అంటే ఏమనుకున్నరు..కేసీఆర్ అంటే ఎవరనుకున్నరు..మొగిలయ్య సర్కారు చదువు గురించి పాడుతుంటే పొంగిపోతాడు..సక్కనైన చదువు.. స్వచ్ఛమైన చదువు అని పాడుతుంటే పొంగిపోతాడు..చెప్పానుగా భోళా మనిషి.. మొగిలయ్యా! నీవు ఇంకా నీ పాటను కొత్త తరానికి చేర్చాలి అని చెప్పి, ఇదిగో నీ ఆనందంలో మేం అంతా ఉన్నాం అని భరోసా ఇచ్చి పంపుతాడు. ఏమున్నా ఉంటే ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు చెప్పు..ఏం కాదు నీ సమస్యలు నేను పరిష్కరించి పంపుతాను..అని కూడా చెబుతాడు కేసీఆర్..
వందనాలు చెల్లిస్తున్నాను.ఇంకొందరు పేద కళాకారులు అరుదైన కళను విశ్వవ్యాప్తం చేసేందుకు తెలంగాణ పాట గొప్పతనాన్ని చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.వారి గురించి పట్టించుకోండి మీరు.. ప్లీజ్ ప్లీజ్..మొగిలయ్య గారూ! మీకు శుభాకాంక్షలు..
– రత్నకిశోర్ శంభుమహంతి,శ్రీకాకుళం