ఆశ్రమ పాఠశాలలో టీచర్ల పంచాయితీ.. ఒకరినొకరు దూషించికుంటూ!

-

విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే క్రమశిక్షణ తప్పారు. తామున్నది బయటన, స్కూల్‌లోనా అనే విషయాన్ని మరిచి మరీ జిగుప్సకరంగా ప్రవర్తించారు.ఒకరినొకరు దూషించుకుంటూ ఘర్షణకు దిగారు. అది చూసిన తోటి ఉపాధ్యాయులు వారిని వారించకుండా మిన్నకుండిపోయిన ఘటన కొత్తపల్లి గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగుచూసింది.

అసలు విషయం ఏమిటంటే .. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం కొత్తపల్లి గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ బాలచందర్‌కు మాతృ వియోగం జరిగింది. దీంతో ఆయన విధులకు దూరంగా ఉన్నారు.ఈ క్రమంలో మరొక ఉపాధ్యాయుడికి ఇంచార్జ్‌గా అవకాశం ఇచ్చారు.

అయితే, సహా ఉపాధ్యాయులతో సమయపాలన పాటించడం లేదని,విధులకు హాజరు కాకుండా హాజరు వేసుకోవడం, పాఠాలు చెప్పకుండా గదిలో పడుకోవడం చేస్తున్నారని ఉపాధ్యాయు బృందం మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఒకరినొకరు దూషించుకుంటూ ఘర్షణకు దిగారు. ఆ విషయం కాస్త బయటకు రావడంతో విద్యార్థుల పేరెంట్స్ టీచర్ల తీరును తప్పుబడుతున్నారు. వీరి వ్యవహారం తెలిసిన ప్రిన్సిపల్ టీచర్లకు సర్దిచెప్పి మరొకసారి రిపీట్ కావొద్దని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version