Hunt Movie : RGV భామతో..సుధీర్ బాబు ఐటం సాంగ్

-

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో సుధీర్ బాబు కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎస్ ఎం ఎస్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన సుధీర్బాబు ఆ తర్వాత క్రమక్రమంగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలను కూడా అందుకున్నాడు. అయితే.. ప్రస్తుతం హీరో సుధీర్ బాబు చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

అందులో హంట్ సినిమా ఒకటి. మహేష్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సుధీర్ కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు సినిమాపై హైప్ ను పెంచేశాయి. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది.

ఇక ఈ మూవీ టీజర్ లో సుధీర్ బాబు దుమ్ము లేపేశాడు. ఇందులో యాక్షన్ సీన్స్ కు కూడా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని ఐటెం సాంగ్‌ పై అప్డేట్‌ ఇచ్చారు. పాప పైలం అంటూ సాగే ఐటెం సాంగ్‌ ను ఈ నెల 11న ఉదయం 10:04am గంటలకు రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఇందులో సుధీర్‌ బాబు, అప్సరా రాణి స్టెప్పులు వేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version