మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ఇవాళ ఆయన టీడీపీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన లిస్ట్‌ను ఎల్‌ఈడీ స్క్రీన్‌లో చూపిస్తూ వివరించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ.. చంద్రబాబుపై జగన్ రెడ్డి, అతని జేబు సంస్థ సీఐడీ పెట్టిన కేసులు తప్పని నిరూపించడానికి టీడీపీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తాడేపల్లి ప్రధాన జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం చూస్తే అతనికి కళ్లు చెవులతో పాటు మెదడు కూడా పనిచేయడం లేదని అర్థమైందని ధ్వజమెత్తారు.
నెల రోజులకు పైగా ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్, ఇన్నర్ రింగ్ రోడ్ పై చేస్తున్న నిరాధార ఆరోపణలకు సంబంధించి కట్టలకొద్దీ పత్రాలు, పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, apskill devolopmenttruth.com వంటి వెబ్ సైట్ ను ప్రజల ముందు ఉంచామని, అయినప్పటికీ ఒక వెబ్ సైట్ ఓపెన్ చేయడం కూడా తెలియక, దానిలోని సమాచారాన్ని గ్రహించే జ్ఞానంలేకనే టీడీపీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని సజ్జల పిచ్చికూతలు కూస్తున్నాడని పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జలకు వెబ్ సైట్లు కూడా ఓపెన్ చేసి, వాస్తవాలను పరిశీలించే కనీస పరిజ్ఞానం లేకపోతే, తమ కార్యాలయానికి వస్తే పెద్ద డిజిటల్ స్క్రీన్ పై ఆధారాలు ప్రదర్శించి మరీ ఆయన నోరు మూయిస్తామని అన్నారు పట్టాభిరామ్. తెలుగుదేశం పార్టీ బయటపెట్టే వాటికి సమాధానం చెప్పడం చేతగాక… చేతిలో నీలిమీడియా ఉందని, తామేం చెప్పినా ప్రజలు నమ్ముతారని తాడేపల్లి ప్రధాన జీతగాడు సజ్జల, ముఖ్యమంత్రి అనుకుంటే కుదరదని పట్టాభి స్పష్టంచేశారు పట్టాభిరామ్.