జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం జనసేన అధినేత భారతీయ జనతా పార్టీ నేతలతో ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా కాస్త ఆయన విషయంలో జాగ్రత్త పడుతున్నట్లు కనపడుతుంది. బీజేపీ కీలక నేతలు కొంతమంది పవన్ కళ్యాణ్ విషయంలో ఈ మధ్య కాలంలో తెలంగాణలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీంతో పవన్ కళ్యాణ్ అలిగారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. పదేపదే బీజేపీ నేతలు అవమానిస్తున్నారు అనే ఆవేదన కూడా ఆయనలో ఎక్కువగా ఉంది. ఈ వ్యాఖ్యలను ఆయన బహిరంగంగానే చేశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ జాగ్రత్తపడి ఆయనను న్యూఢిల్లీ ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనతో భేటీ అయ్యే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం.
పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అమిత్షా ఇప్పటివరకు సరిగా కలిసి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కారణంగా బీజేపీకి నష్టం ఎక్కువగా జరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని దగ్గర చేసుకోకపోతే ఇబ్బంది అని భావించి ఆయనను దగ్గర చేసుకోవడానికి బిజెపి నేతలు ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత గాని స్పష్టత రాదు.